వాస్తవాలను తొక్కిపెట్టిన పిటిషనర్కు రూ.కోటి జరిమానా
• తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు కోర్టులో ఓ అంశంపై పిటిషన్ల మీద పిటిషన్లు
• న్యాయవ్యవస్థను దుర్వినియోగపరచడమేనన్న న్యాయమూర్తి
భారతీయ సమాజానికి సత్యం అనే విలువేపునాది. సత్యం అంటే వాస్తవాలు మాట్లాడటమే కాకుండా సార్వత్రిక చట్టాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలను అనుసరిస్తూజీవించడం ప్రధానం. ఆధునిక ప్ర పంచంలో సామాజిక, రాజకీయ, చట్టపరమైన వ్యవస్థల సమగ్రత పరిరక్షణలో సత్యం అంతర్భాగమే.
ఈ ప్రాథమిక విలువను ఎలా తొక్కిపెట్టారన్నదానికి ఈ కేసు ఓ మచ్చుతునక.
- జస్టిస్ నగేశ్ భీమపాక
వాస్తవాలను తొక్కి పెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపై పిటిషన్లు
వేస్తూ కోర్టులపై భారం మోపడమే కాక, విలువైన సమయాన్ని వృథా చేసిన హైదరాబాద్కు చెందిన వెంకటరామిరెడ్డి అనే వ్యక్తికి రూ. కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని, చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుంచాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ న్ను ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి.
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్గ్రామం సర్వే నం.310/1, 310/2లోని 9.11 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై జస్టిస్ నగేశ్భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. 1980లో ఆర్.వెంకటేశం అనే వ్యక్తి నుంచి పిటిషనర్ తండ్రి పట్టాభిరామిరెడ్డి ఆ భూమిని కొనుగోలుచేశారన్నారు. వాస్తవంగా పట్టాభూమి అయినప్పటికీసర్వే పొరపాటుతో అబాది భూమిగా నమోదైందన్నారు.దీంతో పిటిషనర్ను ఆక్రమణదారుగా పేర్కొంటూ ఆర్డీవోలేఖ రాశారన్నారు. ఈ నేపథ్యంలో భూమి అబాది అని,నిషేధిత జాబితాలో ఉందంటూ తహసీల్దార్ సబ్ రిజిస్ట్రారక్కు లేఖ రాశారన్నారు. నిషేధిత జాబితాలో ఉంచుతూనోటిఫికేషన్ జారీ చేయకుండా రిజిస్ట్రేషను నిలిపివేసేఅధికారం ఏ అధికారికీ లేదని పేర్కొన్నారు.అనుకూల ఉత్తర్వులు పొందడానికి ఫోరం షాపింగ్ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... "సర్వేనంబర్ 23, 310/1, 310/2లోని భూమికి సంబంధించిన హక్కులపై ప్రభుత్వానికి ఆర్. వెంకటేశంకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమి హక్కులపై ఆర్. వెంకటేశం సివిల్ కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి అనుకూలంగా 1998లో తీర్పువెలువడింది. అనంతరం పలు అప్పీళ్లలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాగా ప్రస్తుతం హైకోర్టు ధర్మాసనం వద్ద (సెకండ్ అప్పీలు) పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఆర్.వెంకటేశం మృతి చెందడంతో ఆయన కుమారుడు పార్టీగా కేసును కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలోనే ఆ భూమిని కొనుగోలు చేశామంటూ.. రిజిస్ట్రేషన్ చేయాలంటూ వెంకటరామిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అభ్యర్ధనలు, ప్రతివాదుల పేరు మార్చడం ద్వారా వివిధ బెంచ్లకు పిటిషన్లు వెళ్లేలా చూసుకుంటూ అనుకూల ఉత్తర్వులు పొందడానికి 'ఫోరం షాపింగ్ చేస్తూ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తు న్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం 2022 డిసెంబరులో పిటిషన్ వేసి 2023 మార్చిలో ఉపసంహరించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో సవరణకు 2023 ఫిబ్రవరిలో పిటిషన్ వేసి 2024లో ఉపసంహరించుకున్నారు. జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేయాలంటూ ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులపై 2023లో పిటిషన్ వేసి 2024లో ఉపసంహరించుకున్నారు. వాస్తవాలను తొక్కిపెట్టి గతేడాది యథాతథస్థితి ఉత్తర్వులు, కింది కోర్టులో శాశ్వత ఇంజంక్షన్ పొందడంతోపాటు తిరిగి పోలీసుల రక్షణ కోరుతూ పిటిషన్లు వేస్తూ ఫోరం షాపింగ్ చేస్తున్నారు. వివాదం ఆర్.వెంకటేశానికి, ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఉంది" అని వివరించారు.
అన్ని అంశాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషనర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టులోపిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ వివాదానికి సంబంధించిన అన్ని వాస్తవాలను కోర్టు ముందుంచాల్సి ఉందన్నారు. అనుకూల ఉత్తర్వులు పొందడానికి వాస్తవాలను తొక్కి పెడితే ప్రతివాదులతోపాటు కోర్టునూ తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. "తహసీల్దార్వాదన ప్రకారం ఆ భూమికి యజమానులంటూ ఆర్.వెంకటేశం పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇది తేలకుండా
ఆస్తుల విక్రయానికి పిటిషనర్ తదితరులను అనుమతించలేము. వాస్తవాలను వెల్లడించకుండా పిటిషన్లపై పిటిషన్లు దాఖలు చేస్తూ ఉత్తర్వులు పొందారు న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారు. తగిన శిక్ష ద్వారా ఇలాంటివాళ్లను అడ్డుకొని న్యాయస్థానాల స్వచ్ఛతను పరిరక్షించుకోవాల్సి ఉంది" అని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషన్ను కొట్టివేస్తూ రూ. కోటి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Post a Comment