వాస్తవాలను తొక్కిపెట్టిన పిటిషనర్కు రూ.కోటి జరిమానా • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు కోర్టులో ఓ అంశంపై పిటిషన్ల మీద పిటిషన్లు • న్యాయవ్యవస్థను దుర్వినియోగపరచడమేనన్న న్యాయమూర్తి భారతీయ సమాజానికి సత్యం అనే విలువేపునాది. సత్యం అంటే వాస్తవాలు మాట్లాడటమే కాకుండా సార్వత్రిక చట్టాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలను అనుసరిస్తూజీవించడం ప్రధానం. ఆధునిక ప్ర పంచంలో సామాజిక, రాజకీయ, చట్టపరమైన వ్యవస్థల సమగ్రత పరిరక్షణలో సత్యం అంతర్భాగమే. ఈ ప్రాథమిక విలువను ఎలా తొక్కిపెట్టారన్నదానికి ఈ కేసు ఓ మచ్చుతునక. - జస్టిస్ నగేశ్ భీమపాక వాస్తవాలను తొక్కి పెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ కోర్టులపై భారం మోపడమే కాక, విలువైన సమయాన్ని వృథా చేసిన హైదరాబాద్కు చెందిన వెంకటరామిరెడ్డి అనే వ్యక్తికి రూ. కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని, చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుంచాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ న్ను ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో జరిమానా విధిస్త...